Amaravati: తాడికొండ వైసీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ.. బేతపూడి సొసైటీ చైర్మన్ రాజీనామా

YSRCP Leader of Amaravathi resigns for his post
  • రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపిన షేక్ జాకీర్
  • ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైఖరితోనే రాజీనామా చేశానని వ్యాఖ్య
  • మైనార్టీలకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని ఆరోపణ
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఫిరంగిపురం మండలం బేతపూడి సొసైటీ చైర్మన్ పదవికి షేక్ జాకీర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ స్థానిక ఉమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైఖరితోనే తాను రాజీనామా చేశానని చెప్పారు. పార్టీ వ్యవహారాల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. ఉండవల్లి శ్రీదేవి కేవలం ఆమె సామాజిక వర్గానికే ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కొన్ని రోజుల క్రితమే తాడికొండ మండల యూత్ అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడం గమనార్హం.
Amaravati
Bethapudi
Society Chairmen
resign
YSRCP
Undavalli Sridevi

More Telugu News