central government: బీ ఎలర్ట్‌... కరోనాపై ఆరు రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

  • ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
  • జాబితాలో  పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్
  • దేశంలో బాధితుల సంఖ్య 30కి చేరిక
Be alert on corona says centre

కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా  పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 30కి చేరింది. ఆగ్రా నగరానికి చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబం కరోనా బాధితుడితో కలిసి ఉంది. దీంతో ఆ కుటుంబానికి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News