Yes Bank: యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఏటీఎంల వద్ద ఖాతాదారుల క్యూ

Yes Bank withdrawal limit capped at Rs 50000
  • నిధుల కొరత ఎదుర్కొంటున్న యస్ బ్యాంక్
  • నెలకు రూ. 50 వేలకు మించి డ్రా చేసుకోకుండా ఆంక్షలు
  • నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ ఫర్ అవడం లేదంటున్న ఖాతాదారులు
యస్ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ బ్యాంకు ఖాతాదారులు ఆందోళనలో మునిగిపోయారు. తమ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ఆ బ్యాంకు ఏటీఎంల వద్ద క్యూకట్టారు. దీంతో ఏటీఎంలు కిక్కిరిసిపోయాయి.

యస్ బ్యాంకు నిధుల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖాతాదారులు నెలకు రూ. 50 వేలకు మించి విత్ డ్రా చేసుకోరాదంటూ ఆర్బీఐ ఆంక్షలు విధించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఆర్బీఐ ప్రకటనతో ఆందోళనకు గురైన ఆ బ్యాంకు ఖాతాదారులు ఈ ఉదయం నుంచే ఏటీఎంల వద్ద బారులు తీరారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు పోటీలు పడ్డారు. మరోవైపు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును వేరే ఖాతాల్లోకి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఖాతాదారులు అంటున్నారు. 
Yes Bank
ATMs
RBI
withdraw

More Telugu News