Corona Virus: కరోనా ఎఫెక్ట్‌.. ఈ నెల 31 వరకు ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు

 Delhi schools to remain shut till March 31
  • రేపటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం
  • బిహార్‌‌లో పరిశీలనలో 89 మంది
  • వారిలో ఇరాన్‌ నుంచి వచ్చిన వాళ్లు 14 మంది
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని  నిర్ణయించినట్టు రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా గురువారం ప్రకటించారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు నోటిఫికేషన్ ఇచ్చారు. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు పాఠశాలలను మూసి వేయాలని పేర్కొన్నారు.
 
బిహార్‌‌లో కూడా కరోనా కలకలం రేగింది. కరోనా వైరస్‌ లక్షణాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 89 మందిని పరిశీలనలో ఉంచారు. ఇందులో ఇరాన్‌ నుంచి వచ్చిన వాళ్లు 14 మంది ఉన్నారు. అయితే, తమ రాష్ట్రంలో ఇప్పటిదాకా  ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని బిహార్‌‌ ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటించారు. 48 మందికి పరీక్షలు చేయగా అందులో 44 మంది రిపోర్టులు నెగిటివ్‌గా వచ్చాయని చెప్పారు. మిగతా ముగ్గురి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.
Corona Virus
New Delhi
schools
clossed
bihar

More Telugu News