Shekawat: పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఖర్చు చేసిన ప్రతి రూపాయిని కేంద్రం చెల్లిస్తుంది: షెకావత్

  • పోలవరంపై పార్లమెంటులో ప్రశ్నించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని
  • లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్రమంత్రి షెకావత్
  • ఇప్పటివరకు రూ.8614 కోట్లు ఇచ్చామని వెల్లడి
Union ministers Shekawat tells house central government will pay for Polavaram

పోలవరం ప్రాజెక్టు అంశంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ సమాధానమిచ్చింది. ఫిబ్రవరి నాటికి పోలవరం 69.54 శాతం పూర్తయినట్టు రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి షెకావత్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును 100 శాతం కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. 2014 నుంచి రాష్ట్రం ఖర్చు చేసిన ప్రతి రూపాయిని కేంద్రం చెల్లిస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు రూ.8614.16 కోట్లు ఏపీకి చెల్లించిందని పేర్కొన్నారు. ఈ మొత్తంలో గత నెల విడుదల చేసిన రూ.1850 కోట్లు కూడా ఉన్నాయని వెల్లడించారు.

More Telugu News