నిర్భయ దోషులకు ఈ నెల 20న ఉరిశిక్ష

05-03-2020 Thu 14:45
  • కొత్త డెత్ వారెంట్లు జారీ
  • 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష
  • పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు
Patiala House court orders Nirbhaya convicts will execute on 20th march
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లను జారీ చేసింది. ఈ  నెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశించింది. కాగా, ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో నాలుగోసారి డెత్ వారెంట్లను ఈరోజు పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది.