Charmi: హీరోయిన్ చార్మిపై కేసు నమోదు చేయండి: తెలంగాణ రైట్స్ సొసైటీ

  • కరోనా వైరస్ పై బాధ్యత లేకుండా మాట్లాడారు
  • కేసు నమోదు చేసి విచారణ జరిపించండి
  • హెచ్చార్సీని కోరి తెలంగాణ రైట్స్ సొసైటీ
Book a case against actress Charmi demands Telangana Rights Society

కరోనా వైరస్ గురించి బాధ్యత లేకుండా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ చార్మిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపించాలని హెచ్చార్సీని తెలంగాణ రైట్స్ సొసైటీ కోరింది. వ్యాధి సోకిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ రైట్స్ సొసైటీ దాఖలు చేసింది. 


కరోనా అనుమానితులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స చేయాలని తన వ్యాజ్యంలో తెలంగాణ రైట్స్ సొసైటీ కోరింది. చిన్న పిల్లలకు వ్యాధి సోకకుండా వుండేందుకు పాఠశాలలకు సెలవులు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించింది. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన వ్యక్తికి ప్రత్యేక మూత్రశాల కూడా లేకపోవడంతో... ఆయన కామన్ టాయ్ లెట్ కు వెళ్తున్నారని, దీంతో ఇతర రోగులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపింది. 

More Telugu News