Muralidhar: డబ్బులు పెట్టే నిర్మాతను ఎవరూ గుర్తించరు .. గుర్తుపట్టరు: నిర్మాత రామకృష్ణయ్య

RamaKrishnayya Producer
  • 3 సినిమాలు నిర్మించాను 
  • 4 కోట్లను నష్టపోయాను 
  • ఖర్చు పెరగడానికి కారణాలు చెప్పిన నిర్మాత  
తెలుగులో 'జంక్షన్' .. 'టార్గెట్' .. 'రయ్ రయ్' వంటి చిన్న సినిమాలను రామకృష్ణయ్య నిర్మించారు. ఆ తరువాత ఆయన సినిమాల నిర్మాణానికి దూరంగా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అందుకు గల కారణాలను వివరించారు. "తెలుగులో కొంతమంది ఆర్టిస్టుల కారణంగా నిర్మాతలకి ఖర్చులు పెరిగిపోతున్నాయి. అగ్రిమెంట్ కి ముందు, మామూలు హోటల్లో బసకి ఓకే అంటారు. ఆ తరువాత వాళ్లు ఒక స్టార్ హోటల్ అనుకుని అందులోనే రూమ్స్ బుక్ చేయమంటారు.

ఒక కారు సరిపోతుందని చెప్పి, మూడు నాలుగు కార్లు పంపించమని పట్టుపడతారు. ముందు ఇలా అన్నారు కదా అని అంటే, 'ఎలా ఒప్పుకున్నావ్?' అంటూ మన ముందే వాళ్ల మేనేజర్ ను తిడతారు. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఈ కారణంగానే నేను 3 సినిమాలకి కలుపుకుని 4 కోట్ల వరకూ పోగొట్టుకున్నాను. 4 సినిమాలు చేసిన ఆర్టిస్టులకి ఎంతో గుర్తింపు వస్తుంది. కానీ 40 సినిమాలు తీసిన నిర్మాతలు మాత్రం ఎవరికీ గుర్తుండరు .. ఎవరూ గుర్తుపట్టరు. నిర్మాతలకి విలువ లేదు .. డబ్బు పెట్టిన నిర్మాతలకి అటు డబ్బురాదు .. ఇటు పేరు రాదు. నిర్మాతల సంఖ్య తగ్గుతూ ఉండటానికి ఇది ప్రధాన కారణంగా కనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు.
Muralidhar
RamaKrishnayya
Tollywood

More Telugu News