Nara Lokesh: ఇకపై స్వర్ణకారుల ఆత్మహత్యలు ఉండకూడదు: నారా లోకేశ్​

Nara Lokesh visits Srilakshmi narsimha swamy temple in Mangalagiri
  • మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నా
  • ఆపై లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించా
  • ఈ సొసైటీ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తాం
గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ సందర్శించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం స్థానిక షరాఫ్ బజారులో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.

ఇకపై స్వర్ణకారుల ఆత్మహత్యలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ సంఘాన్ని ప్రారంభించానని, వారు తమ వృత్తిని కొనసాగించే విధంగా పని ప్రదేశాల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని అన్నారు. గోల్డ్ బిస్కెట్స్, ఉచిత వైద్యం సహాయం, బీమా, వారి పిల్లల చదువుకి సాయం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ సొసైటీ ద్వారా అందించనున్నట్టు లోకేశ్ వివరించారు.
Nara Lokesh
Telugudesam
Mangalagiri
Narasimhaswamy temple

More Telugu News