Rakshith: 'పలాస 1978'లో విలన్ గా నా పాత్ర స్పెషల్ : రఘు కుంచె

Palaasa Movie
  • 'పలాస 1978'లో నటించాను 
  • ఐదుగు సింగర్స్ ను పరిచయం చేశాను 
  •  ఈ నెల 6న విడుదలవుతుందన్న రఘు కుంచె

విభిన్నమైన కథాకథనాలతో దర్శకుడు కరుణ కుమార్ 'పలాస 1978' సినిమాను తెరకెక్కించాడు. రఘు కుంచె సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి రఘు కుంచె మాట్లాడుతూ .. "ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాలో రక్షిత్ .. నక్షత్ర నాయకా నాయికలుగా నటించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మాత్రమే నన్ను అడిగారు.

ఆ తరువాత నెగెటివ్ షేడ్స్ కలిగిన ఒక పాత్ర వుంది చేయమని కోరారు. ఆ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండటంతో నేను ఒప్పుకున్నాను. మైండ్ గేమ్ ఆడే నెగెటివ్ రోల్ లో నేను నటించాను. సినిమా మొత్తం కూడా నేను మేకప్ లేకుండా చాలా నేచురల్ గా కనిపిస్తాను. ఈ పాత్ర అందరికీ చాలా కొత్తగా కనిపిస్తుంది .. కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు వున్నాయి. ఐదు పాటలకు ఐదుగురు కొత్త సింగర్స్ ను పరిచయం చేయడం నాకు సంతృప్తిని కలిగించింది. నటుడిగా .. సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News