Brahmaji: హీరోగా ట్రై చేస్తానన్న మా అబ్బాయితో ఒకేఒక మాట చెప్పాను: నటుడు బ్రహ్మాజీ

O Pittakatha Movie
  • ఈ నెల 6వ తేదీన రానున్న 'ఓ పిట్టకథ'
  • బ్రహ్మాజీ తనయుడు సంజయ్ పరిచయం 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న బ్రహ్మాజీ
తెలుగు తెరపై బిజీగా వుండే కేరెక్టర్ ఆర్టిస్టులలో బ్రహ్మాజీ ఒకరుగా కనిపిస్తారు. అటు సీనియర్ హీరోలతోనూ .. ఇటు యువ కథానాయకులతోను ఆయన ఎంతో సన్నిహితంగా వుంటారు. 'ఓ పిట్టకథ' సినిమా ద్వారా ఆయన తనయుడు సంజయ్ తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ .. "ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో ఒకడిగా మా అబ్బాయి సంజయ్ కనిపిస్తాడు. తను హీరోగా ఎంట్రీ ఇస్తానని చెప్పినప్పుడు, 'ట్రై చేయి .. వర్కౌట్ అయితే వుండు .. లేదంటే మరేదైనా పని చూసుకో' అని ఒకేఒక మాట చెప్పాను. తనని సోలో హీరోగానే పరిచయం చేయమని సన్నిహితులు చెప్పారు. కానీ ఒక మంచి పాత్ర ద్వారా .. గుర్తుండిపోయే విభిన్నమైన పాత్ర ద్వారా తన పరిచయం జరిగితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా చేశాను. ఒక తండ్రిగా తనని ఎంతవరకూ సపోర్ట్ చేయాలో అంతవరకూ సపోర్ట్ చేశాను. ఈ సినిమాలో నేను చేసిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర కూడా అందరినీ ఆకట్టుకుంటుంది" అని చెప్పుకొచ్చారు.
Brahmaji
Sanjay
O PittaKatha Movie

More Telugu News