West Bengal: దెబ్బతిన్న విండ్‌ షీల్డ్‌...అత్యవసరంగా ల్యాండ్‌ అయిన విమానం

air asia flight reurns back due to windshield break
  • ఎయిర్‌ ఏషియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
  • కోల్‌కతా నుంచి బ్యాగ్‌డోక్రాకు వెళ్తుండగా ఘటన
  • వడగళ్ల వానకు దెబ్బతిన్న గ్లాస్‌
కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్‌ ఏషియా విమానం ఒకటి కాసేపటికే వెనుదిరిగి అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. నిన్న సాయంత్రం 15-536 నంబరుగల విమానం బ్యాగ్‌డోక్రాకు వెళ్లేందుకు గాల్లోకి లేచింది. కాసేటికి వడగళ్ల వాన పడడంతో విండ్‌షీల్డ్‌ దెబ్బతింది.

దీన్ని గుర్తించిన కెప్టెన్‌ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు. ఈ విమానంలో పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర మంత్రి అరూప్‌ బిస్వాస్‌ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానం క్షేమంగా ల్యాండ్‌ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు’ అని తెలిపారు. కాగా, నిన్న వాతావరణం అనుకూలించక కోల్‌కతా నుంచి రాకపోకలు జరపాల్సిన పలు విమానాలు జాప్యం అయ్యాయి.
West Bengal
kolkatha airport
air asia
windshield

More Telugu News