Andhra Pradesh: హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుంది: ఏపీ డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్

AP Dy CM Pilli Subhash Chandra Bose sensational comments on Hyderabad
  • దేశానికి రెండో రాజధాని విషయంలో అంబేద్కర్ చెప్పింది నిజమవుతుంది
  • అమరావతి ఏపీ రాజధాని కాదని మేమెప్పుడూ చెప్పలేదు
  • ఉత్తరాంధ్రను అభివృద్ది చేయాలనే విశాఖను పరిపాలన రాజధాని చేస్తున్నాం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్టు తెలంగాణ రాజధాని హైదరాబాద్ భవిష్యత్తులో దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ విషయాన్ని కొట్టిపారేయలేమని పేర్కొన్నారు. సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామిని నిన్న దర్శించుకున్న మంత్రి అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఏపీ రాజధాని అమరావతిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరావతి ఏపీకి రాజధాని కాదని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి ఆందోళనలపై మాట్లాడుతూ.. 20 గ్రామాల వారు తప్ప మరెవరూ ఆందోళన చేయడం లేదన్నారు.  పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో తమ ప్రభుత్వం రికార్డు సృష్టించబోతోందని, ఉగాది రోజున 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు బోస్ చెప్పారు.
Andhra Pradesh
Amaravati
Hyderabad
Pilli Subhas Chandra Bose

More Telugu News