KCR: మాడపాటి సత్యవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్

KCR pays tributes to former news reader Madapati Sathyavathi
  • ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ సత్యవతి మృతి
  • లక్షలాది మంది హృదయాలలో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్న కేసీఆర్
  • ఆమె కుటుంబసభ్యులకు సంతాపాన్ని ప్రకటించిన సీఎం
ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యవతి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు తన సుస్వరంతో రేడియోలో వార్తలను చదువుతూ తన హితులకు, సన్నిహితులకు మాత్రమే కాకుండా లక్షలాది మంది శ్రోతల హృదయాలలో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సత్యవతి కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు.

KCR
TRS
Madapati Sathyavathi
News Reader
Akashavani
Death

More Telugu News