Hyderabad: హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కలకలం... సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు ప్రత్యేక చికిత్స

Hyderabad fears Swine Flu as police constable tested positive
  • పేట్లబురుజులో 9 మంది కానిస్టేబుళ్లకు అస్వస్థత
  • ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో పరీక్షలు
  • బాధితుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స
ఓవైపు కరోనా వైరస్ రంగప్రవేశంతో హడలిపోతున్న హైదరాబాదీలను తాజాగా స్వైన్ ఫ్లూ ఆందోళనకు గురిచేస్తోంది. పాతబస్తీలోని పేట్లబురుజులో 9 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు అస్వస్థతకు గురికాగా, వారిలో ఒకరికి స్వైన్ ఫ్లూ సోకినట్టు గుర్తించారు. ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైరస్ బారినపడిన కానిస్టేబుల్ మినహా మిగతా ఎనిమిది మందిని డిశ్చార్జ్ చేశారు. బాధిత కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో రెండ్రోజుల్లో అతడు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Hyderabad
Swine Flu
Police
Old City
Erragadda
Corona Virus

More Telugu News