Twitter: కరోనా ఎఫెక్ట్... ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించిన ట్విట్టర్

  • అనేక దేశాలకు పాకిన కరోనా వైరస్
  • ఉద్యోగులు కార్యాలయాలకు రానవసరం లేదన్న ట్విట్టర్
  • ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ లో అమలు
  • తాజాగా ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం
Twitter offers employees work from home facility due to corona scares

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్-19) ఉద్ధృతి పెరుగుతుండడంతో ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ తన ఉద్యోగుల క్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. బయటి వాతావరణంలో కరోనా వ్యాప్తి ఉంటుందన్న కారణంతో తన ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించింది.

ఇప్పటికే జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా దేశాల్లో ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చామని, ఇది తప్పనిసరి అని ట్విట్టర్ హెచ్ఆర్ విభాగం వెల్లడించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విట్టర్ అధికారి జెన్నిఫర్ క్రిస్టీ వెల్లడించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ గా పేరుగాంచిన ట్విట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. చైనా వెలుపల కూడా అనేక దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా నమోదవుతుండడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News