Nara Lokesh: ప్రజా చైతన్యం అంటే ఇదే కదా: నారా లోకేశ్​ సంతోషం

Nara Lokesh expresses gladness
  • తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాచైతన్య యాత్ర
  • బొబ్బిల్లంక– రఘుదేవరపురం వరకు బైక్ ర్యాలీ సాగింది
  • అసంఖ్యాక ప్రజలు నాపై ఆదరాభిమానాలు చూపారు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన యాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ చేశారు. సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక గ్రామం నుంచి రఘుదేవరపురం వరకు సాగిన బైక్ ర్యాలీ వెంట ప్రయాణించానని, అసంఖ్యాక ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలు ఎంతో సంతోషం కలిగించాయని చెప్పిన లోకేశ్, ‘ప్రజా చైతన్యం అంటే ఇదే కదా’ అని తనకు అనిపించిందని పేర్కొన్నారు. 
Nara Lokesh
Telugudesam
Praja Chaitanya Yatra
East Godavari District

More Telugu News