Telangana: తెలంగాణలో పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించిన కేంద్రం!

  • రాజ్యసభలో రహదారుల అంశాన్ని ప్రస్తావించిన టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్
  • 1365 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులకు గుర్తింపు
  • లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన నితిన్ గడ్కరీ
Several state highways in Telangana recognized as national highways

తెలంగాణలో అనేక రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారులుగా గుర్తింపు లభించింది. దీనిపై రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 1365 కిలోమీటర్ల మేర పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినట్టు గడ్కరీ వెల్లడించారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.

More Telugu News