Ravi Shankar: మా అమ్మ డైరీ నన్ను మార్చేసింది: 'బొమ్మాళీ' రవిశంకర్

 Bommali Ravi shankar gets inspired by her mothers words
  • మా అమ్మ డైరీ రాసేది
  • అమ్మపోయిన తరువాత అన్నయ్య ఆ డైరీ చదివాడు
  • అమ్మ మాటలు నాకు స్ఫూర్తిని కలిగించాయన్న రవిశంకర్  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రవిశంకర్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "అమ్మ తన డైరీ చదివే అధికారాన్ని అన్నయ్యకే ఇచ్చారు. అమ్మపోయిన తరువాత అన్నయ్య ఆ డైరీ చదివాడు. "రవి పెద్ద స్టార్ అవుతాడని నేను అనుకున్నాను. అందుకోసమే అన్నింటిలోను శిక్షణ ఇప్పించాను. కానీ అనుకున్న స్థాయికి వాడు రాలేదు.

డబ్బింగులు చెప్పుకుంటూ ఇదే జీవితమనుకుని బావిలో కప్పలా వుండిపోయాడు. అందుకనే వాడికి అవకాశాలు రాలేదు. వాడిలో దాగిన సత్తాను వాడే వెలికి తెచ్చుకోవాలి .. తనేమిటో నిరూపించుకోవాలి" అని రాశారు. ఆ డైరీలో అమ్మ రాసిన మాటలు నాకు స్ఫూర్తిని ఇచ్చాయి. నాలోని లోటు పాట్లు నాకు తెలిశాయి. ఆ తరువాత నేను కన్నడలో 'కేంపేగౌడ' చేయడం, ఆ సినిమా నుంచి నటుడిగా కూడా నేను బిజీ కావడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.
Ravi Shankar
Sai Kumar
Tollywood
KempeGowda Movie

More Telugu News