cinema: అవును.. తాగుతాను.. ఎందుకు భయపడాలి?: మలయాళ నటి వీణ నందకుమార్

veena about her drinking habit
  • ‘కెట్టోయ్‌లాన్ ఎంటె మాలఖా’ సినిమాలో నటించిన వీణ నందకుమార్
  • ఈ అలవాటును నాకు నేనుగా చేసుకున్నా
  • బీర్ తాగడం గురించి ఎంతైనా మాట్లాడతా 
తాను బీర్‌ బాగా తాగుతానని అంటోంది మలయాళ సినీ హీరోయిన్‌ వీణ నందకుమార్. ఇటీవల వచ్చిన ‘కెట్టోయ్‌లాన్ ఎంటె మాలఖా’ అనే చిత్రంలో ఆమె నటించింది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

తనకున్న తాగుడు అలవాటు వలన ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదని వీణ సమర్థించుకుంది. ఈ అలవాటును తనకు తానుగా చేసుకున్నానని చెప్పింది. తాను తాగుతానన్న విషయాన్ని చెప్పడానికి భయపడబోనని తెలిపింది.

అసలు ఈ విషయాన్ని చెప్పేందుకు తానెందుకు భయపడాలని వీణ ప్రశ్నించింది. తాగడం నేరమేమీ కాదని చెప్పుకొచ్చింది. బీర్ తాగడం గురించి తాను ఎంతైనా మాట్లాడతానని, యువతకు బీర్ తాగడం ఇప్పుడు అలవాటుగా మారింది కదా? అంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
cinema

More Telugu News