Bhagyashree: గతంలో ఓసారి నా భర్తతో విడిపోయి కొన్నాళ్లు దూరంగా ఉన్నా!: సంచలన విషయాన్ని వెల్లడించిన భాగ్యశ్రీ

Bhagyashree Reveals She And Her Husband Once Separated For Over A Year
  • ఏడాదిన్నర పాటు నేను, నా భర్త దూరంగా ఉన్నాం
  • ఆ సమయంలో ఎంతో ఆందోళన చెందాను
  • మరో వివాహం చేసుకోవాలా? అనే ఆందోళన కలిగేది
భాగ్యశ్రీ... ఎప్పటికీ గుర్తిండిపోయే సినీ నటి. 1989లో విడుదలైన 'మైనే ప్యార్ కియా' చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన భాగ్యశ్రీ రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయింది. కెరిర్ ఉన్నతంగా కొనసాగుతున్న సమయంలోనే హిమాలయ దస్సానీని వివాహం చేసుకుంది. వీరి వైవాహిక బంధం అన్యోన్యంగా కొనసాగుతోంది.

అయితే, తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో భాగ్యశ్రీ ఒక సంచలన నిజాన్ని బయటపెట్టింది. తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ... గతంలో ఒకసారి తన భర్త నుంచి తాను విడిపోయానని... ఏడాదిన్నర పాటు తన భర్తకు దూరంగా బతికానని చెప్పింది. ఆ రోజులను తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుందని తెలిపింది. 'నేను ప్రేమించిన తొలి వ్యక్తి హిమాలయ. అందుకే అతన్ని పెళ్లి చేసుకున్నా. కానీ మేమిద్దరం విడిపోయిన సందర్భం కూడా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది.

తన భర్తతో విడిపోయినప్పుడు ఎంతో ఆందోళనకు గురయ్యానని భాగ్యశ్రీ తెలిపింది. ఆయన మళ్లీ తన జీవితంలోకి రారా? తాను మరో వివాహం చేసుకోవాలా? అనే భయాందోళనలకు గురయ్యానని చెప్పింది. ఆ రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ భయం కలుగుతుందని తెలిపింది.
Bhagyashree
Bollywood
Husband
Himalaya Dassani
Seperation

More Telugu News