మా అబ్బాయిని కూడా హీరోగా పరిచయం చేస్తున్నాను: 'బొమ్మాళీ' రవిశంకర్

03-03-2020 Tue 11:16
  • మా అబ్బాయి పేరు 'అధ్వే'
  • న్యూయార్క్ లో నటనలో శిక్షణ పూర్తవుతుంది 
  • ఉగాదికి హీరోగా ఒక సినిమా లాంచ్ చేస్తున్నామన్న రవిశంకర్
 Bommali Ravishankar introduces his son as a hero
అలనాటి నటుడు పీజే శర్మ ఫ్యామిలీ నుంచి వారసుడిగా సాయికుమార్ వచ్చారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తమ్ముడైన రవిశంకర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకున్నారు. అవకాశాన్ని బట్టి ఆయన నటుడిగాను చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ హీరోగా నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. త్వరలోనే తన తనయుడు 'అధ్వే'ను కూడా హీరోగా పరిచయం చేయనున్నట్టు రవిశంకర్ చెప్పాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రవిశంకర్ మాట్లాడుతూ .. "మా అబ్బాయి పేరు 'అధ్వే' .. ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ పై న్యూయార్క్ లో శిక్షణ పొందుతున్నాడు. త్వరలోనే మూడేళ్ల శిక్షణా కాలం పూర్తవుతుంది. అతను హీరోగా ఒక సినిమాను ఉగాదికి లాంచ్ చేయనున్నాము" అని చెప్పుకొచ్చారు.