Maharashtra: మహారాష్ట్ర సీఎం ఇంటి సమీపంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్... పిస్టల్ తో తిరుగుతుంటే అరెస్ట్!

Most Wanted Criminal Arrest near Maharashtra Cm House
  • మాతోశ్రీ నివాసం సమీపంలో ఇర్షాద్ ఖాన్ అరెస్ట్
  • ఏడు కాట్రిడ్జ్ లు స్వాధీనం
  • పలు రాష్ట్రాల్లో నిందితుడిగా ఉన్న ఇర్షాద్
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఉండే బాంద్రా పరిధిలోని మాతోశ్రీ నివాసం సమీపంలో పిస్టల్ తో తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పలు దోపిడీలు, హత్యలు, దొంగతనాలు చేసిన కరుడుగట్టిన క్రిమినల్ ఇర్షాద్ ఖాన్ ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ ప్రాంతంలో ఇర్షాద్ అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా, పోలీసులు ప్రశ్నించారని, సోదాల్లో పిస్టల్ తో పాటు ఏడు కాట్రిడ్జ్ లు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాంద్రా ప్రాంతంలో ఇతను తిరుగుతూ ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అందుకుని, భద్రతను పెంచామని, ఈ క్రమంలోనే అతను పట్టుబడ్డాడని తెలిపారు.
Maharashtra
Irshad Khan
Arrest
Police
Uddhav Thackeray

More Telugu News