మూడు పరోటాలను 50 నిమిషాల్లో తింటే లక్ష రూపాయల ప్రైజ్!

Parantha eating competition at Hotel Tapasya in Haryana
  • హర్యానాలో పరోటాలకు పేరుగాంచిన హోటల్ తపస్య
  • ప్రత్యేకంగా జంబో పరోటాలు తయారీ
  • ఒక్కోటి రెండున్నర అడుగుల మేర ఉండే నేతి పరోటాలు
  • నిర్ణీత సమయంలో తిన్నవారికి నగదుతో పాటు జీవితాంతం ఫుడ్ ఫ్రీ
హర్యానాలోని రోహతక్ లో హోటల్ తపస్య అంటే పరోటాలకు చాలా ఫేమస్. అక్కడ 2006 నుంచి పరోటాల పోటీ నిర్వహిస్తున్నారు. 50 నిమిషాల్లో 3 పరోటాలు తింటే లక్ష రూపాయల బహుమతితో పాటు జీవితాంతం ఫ్రీగా భోజనం అందిస్తారు. ఆ... పరోటాలే కదా ఈజీగా లాగించేయొచ్చు అనుకోకండి! ఇవి జంబో పరోటాలు మరి! ఒక్కో పరోటా సైజు రెండున్నర అడుగుల మేర ఉంటుంది. ఆ పరోటా మధ్యలో రెండు కిలోల కుర్మా ఉంటుంది. ఆలూ మిక్స్, ఆనియన్, కాలీఫ్లవర్ కుర్మాలను ఈ పరోటాల్లో వినియోగిస్తారు.

సాధారణంగా ఒక్కో జంబో పరోటాను ఐదుగురు తింటారు. వీటి ధర రూ.300 నుంచి మొదలవుతాయి. నేతితో తయారయ్యే ఈ భారీ పరోటాలను తినేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. గత 14 ఏళ్లుగా ఈ పోటీలు జరుగుతున్నా ఇప్పటివరకు నెగ్గింది ఇద్దరంటే ఇద్దరేనట! పోటీల సంగతి ఎలా ఉన్నా తపస్య హోటల్లో తయారయ్యే పరోటాల రుచి ఇంకెక్కడా లభించదని కస్టమర్లు లొట్టలు వేస్తుంటారు.
Go Back to Shorts
Jumbo Parantha
Hotel Tapasya
Haryana
Rohtak

More Telugu News