Nirbhaya: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై మరోమారు ‘స్టే’

  • డెత్ వారెంట్లపై మూడో సారి ‘స్టే’
  • నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తా పిటిషన్ పై విచారణ
  • తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ‘స్టే’ కొనసాగుతుందన్న కోర్టు
 Patiala house court again imposed stay on Nirbhaya convicts death warrants

నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్ష అమలు తేదీపై ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మరోమారు ‘స్టే’ విధించింది. డెత్ వారెంట్లపై ‘స్టే’ విధించాలని కోరుతూ నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ డెత్ వారెంట్లపై ఈ ‘స్టే‘ కొనసాగనుంది.  

కాగా, నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై న్యాయస్థానం ఇప్పటికే రెండుసార్లు ‘స్టే’ విధించింది. వాస్తవానికి రేపు ఉదయం నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే, డెత్ వారెంట్లపై న్యాయస్థానం తాజా ఆదేశాలతో మూడోసారి ‘స్టే’ విధించినట్టు అయింది.

More Telugu News