కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించిన రేవంత్ రెడ్డి అరెస్ట్
- కేటీఆర్ అక్రమ నిర్మాణాలు నిర్మించారంటూ రేవంత్ ఆరోపణలు
- గండిపేట వెళ్లే దారిలో ఫామ్ హౌస్ నిర్మించారన్న రేవంత్
- నిబంధనలను అతిక్రమించారంటూ విమర్శలు
ఫామ్ హౌస్ ను ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, చట్టాలను అతిక్రమిస్తూ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ దర్జాగా గడుపుతున్నారని, నిబంధనలకు నీళ్లొదిలి పాతిక ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారని, జీవో 111ని అతిక్రమించారని కేటీఆర్ పై ఆరోపణలు చేశారు.