Devineni Uma: వసంత నాగేశ్వరరావుకు దేవినేని ఉమ వార్నింగ్!

Devineni Uma warns Vasantha Nageshwar Rao
  • ఎన్టీఆర్ గుట్ట, పురగుట్ట స్థలాలను రద్దు చేయొద్దు
  • పేదల కడుపు కొట్టే పనులు చేయొద్దు
  • పద్ధతి మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోబోము
మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గుట్ట, పురగుట్ట స్థలాలను రద్దు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పేదల కడుపు కొట్టే పనులు చేయవద్దని... పద్ధతి మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. తింగరి వేషాలు మానుకోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైయస్సార్ మద్యం పథకం కింద వైసీపీ నేతలు అధిక ధరలకు మందు అమ్ముతున్నారని ఆరోపించారు. ఏడాదికి రూ. 3 వేల కోట్ల జేట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Devineni Uma
Telugudesam
Vasantha Nageshwar Rao
YSRCP

More Telugu News