Naga Chaitanya: విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ

  • 'లవ్ స్టోరీ'తో పలకరించనున్న చైతూ 
  • సెట్స్ పైకి వెళ్లనున్న 'బంగార్రాజు'
  • లైన్లో 'నాగేశ్వరరావ్'ప్రాజెక్ట్
Vikram Kumar Movie

ఈ మధ్య కాలంలో నాగచైతన్య కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ సినిమా తరువాత ఆయనను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి 'బంగార్రాజు' .. 'నాగేశ్వరరావ్' సిద్ధంగా వున్నాయి. ఆ తరువాత సినిమాను కూడా చైతూ లైన్లో పెట్టేశాడని అంటున్నారు. 'దిల్' రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. బీవీఎస్ రవి ఈ సినిమాకి కథను అందించినట్టుగా చెబుతున్నారు. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. అఖిల్ తో 'హలో' చేసిన విక్రమ్ కుమార్, ఈ సారి చైతూను సెట్ చేయడం విశేషం.

More Telugu News