Chiranjeevi: అనసూయను చూసి 'రంగమ్మత్త' అంటూ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఉబ్బితబ్బిబ్బయిన యాంకర్

chiranjeevi about anasuya
  • నిన్న రాత్రి జరిగిన 'ఓ పిట్టకథ' సినిమా ప్రీరిలీజ్‌లో చిరు వ్యాఖ్యలు
  • అనసూయను చూసి తన గుండెకు పెయిన్‌ వచ్చిందన్న మెగాస్టార్
  • హాహాహా... చాలా క్యూట్ అంటూ అనసూయ ఆనందం
నిన్న రాత్రి జరిగిన 'ఓ పిట్టకథ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రంగమ్మత్త గెస్ట్‌గా వచ్చినందుకు సంతోషం. మొన్న టెస్ట్‌ చేయించుకున్నాను.. నా గుండె చాలా స్ట్రాంగ్‌గా ఉందని అన్నారు. కానీ, ఇప్పుడు ఎందుకో చాలా పెయిన్‌ వచ్చింది అర్థం కావట్లే.. రామ్‌ చరణ్‌కి చెప్పకమ్మా!' అని చిరంజీవి అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన అనసూయ హర్షం వ్యక్తం చేసింది.

'హాహాహా... చాలా క్యూట్.. చాలా వినయం.. మెగా లెజెండ్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది' అంటూ ఎప్పటికీ చిరు ఫ్యాన్ అని ట్వీట్ చేసింది. అమితానందం వ్యక్తం చేస్తున్నట్లు, సిగ్గుపడుతున్నట్లు స్మైలీలు పోస్ట్ చేసింది.
Chiranjeevi
Tollywood
anasuya

More Telugu News