Nikhil: తిరుపతిలో 'కార్తికేయ 2' మూవీ లాంచ్

Karthikeya 2 Movie
  • గతంలో వచ్చిన 'కార్తికేయ' హిట్ 
  • ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • త్వరలోనే మిగతా వివరాల వెల్లడి
నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి కొంతకాలం క్రితం తెరకెక్కించిన 'కార్తికేయ'కి మంచి ఆదరణ లభించింది. కుమారస్వామి ఆలయం నేపథ్యంలో జరిగే అనూహ్యమైన సంఘటనలు .. ప్రజల నమ్మకం .. సైన్స్ .. ఇలా మూడు కోణాలకు ముడిపెడుతూ సాగిన కథ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. దాంతో ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కు శ్రీకారం చుట్టారు.

ఈ రోజున తిరుమలలో ఈ సినిమాను లాంచ్ చేశారు. ఉగాది నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. కొంతకాలంగా తాము ఎదురుచూస్తున్న సరైన హిట్, ఈ సినిమాతో పడుతుందనే ఉద్దేశంతో చందూ .. నిఖిల్ వున్నారు. ద్వాపర యుగం నాటి ఓ రహస్యాన్ని కలియుగంలో ఛేదించే పాయింట్ తో రూపొందుతున్న ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేపుతోంది.
Nikhil
Chandoo Mondeti
karthikeya 2 Movie

More Telugu News