Nikhil: 'కార్తికేయ 2' కాన్సెప్ట్ వీడియో టీజర్ కి మంచి రెస్పాన్స్

  • చందూ మొండేటి నుంచి 'కార్తికేయ 2
  •  ద్వాపరయుగం నాటి రహస్యం చుట్టూ తిరిగే కథ 
  •  ఉగాది నుంచి చిత్రీకరణ మొదలు  
Karthikeya 2 Movie

చందూ మొండేటి - నిఖిల్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తికేయుడి ఆలయం నేపథ్యంలో సాగిన కథాకథనాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2'ను రూపొందించడానికి చందు మొండేటి - నిఖిల్ రంగంలోకి దిగారు.

నిన్న ఈ సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ వీడియోను వదలగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం .. ఈ యుగంలో దానిని తెలుసుకోవడానికి సాగించే అన్వేషణగా ఈ కథ నడవనుందని తెలుస్తోంది. స్వార్థానికి ఒకరు .. సాధించడానికి ఒకరు .. మంచి సంకల్పానికి సాయం చేసిన దెవరు? అంటూ సాగిన ఈ వీడియో టీజర్, కథా వస్తువుపై అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ, ఉగాది నుంచి మొదలుకానుంది.

More Telugu News