Balakrishna: బాలకృష్ణ అఘోర పాత్ర ప్రత్యేకత అదేనట

  • విభిన్నమైన కథాంశంతో బోయపాటి మూవీ
  • బాలయ్య సరసన శ్రియ - అంజలి 
  • అఘోర పాత్రలో కనిపించనున్న బాలయ్య
Boyapati Sreenu Movie

బాలకృష్ణ తన తదుపరి సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఒక పాత్రలో రాయలసీమ యువకుడిగా .. మరో పాత్రలో కాశీలోని అఘోరగా ఆయన కనిపించనున్నారని అంటున్నారు.

అఘోర పాత్రలో బాలకృష్ణ చేతలే తప్ప, మాటలు పెద్దగా ఉండవట. ఈ పాత్రలో చాలా వరకూ ఆయన మౌనంగానే కనిపిస్తూ తన పనులు చేసుకుంటూ వెళుతుంటాడని అంటున్నారు. అతి తక్కువ డైలాగ్స్ తో బాలకృష్ణ చేసిన పాత్ర ఇదేనని చెబుతున్నారు. ఈ పాత్ర ప్రత్యేకత ఇదేనని అంటున్నారు. ఇంతవరకూ బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి ఇది భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఆయన సరసన నాయికలుగా శ్రియ - అంజలి కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News