Koneru Hampi: కోనేరు హంపి మరో ఘనత... ఇక వరల్డ్ టాప్-2 ర్యాంకర్!

World Second Ranker In Chess is Our Koneru Hampi
  • కెరీర్ లో మరో మెట్టెక్కిన హంపి
  • ఫిడే తాజా ర్యాంకింగ్స్ లో రెండో స్థానం 
  • తొలి స్థానంలో చైనాకు చెందిన హూ ఇఫాన్
తన చెస్ కెరీర్ లో తెలుగు తేజం కోనేరు హంపి మరో మెట్టెక్కింది. తాజాగా ఫిడే (ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్) విడుదల చేసిన ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచింది. హంపికి 2,586 ఎల్లో రేటింగ్ పాయింట్లు రాగా, చైనాకు చెందిన హూ ఇఫాన్ 2,658 ఎల్లో రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఇక ఇప్పటివరకూ సెకండ్ ర్యాంకర్ గా ఉన్న చైనా క్రీడాకారిణి జూ వెన్ జున్ 2,583 పాయింట్లతో మూడో ర్యాంకుకు దిగజారింది. ఏపీకి చెందిన మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 9వ ర్యాంక్ లో (2,517 పాయింట్లు) కొనసాగుతోంది.
Koneru Hampi
FIDE
Chess
Rank

More Telugu News