Budda Venkanna: జగ్గడు ఆ వ్యాధితో బాధపడుతున్నాడు!: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్
- 9 నెలల నుండి తిత్తర, బిత్తర అంటూ తెలుగులో జగ్గడు కామెడీ
- ఆ స్టాండ్ అప్ కామెడీ మిస్ అయ్యినట్టు ఉన్నావు సాయిరెడ్డి
- జగ్గడికి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిస్ఆర్డర్
- జైలు భయం వెంటాడుతోంది
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తోన్న విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అక్రమ సంపాదనల డొంక కదులుతుంటే నారా లోకేశ్ సైకోపాత్(Psychopath)లా మారిపోయాడంటూ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై బుద్ధా వెంకన్న స్పందిస్తూ.. '9 నెలల నుండి తిత్తర, బిత్తర అంటూ తెలుగులో జగ్గడు చేస్తున్న స్టాండ్ అప్ కామెడీ మిస్ అయ్యినట్టు ఉన్నావు సాయిరెడ్డి' అని ట్వీట్ చేశారు.
'జగ్గడు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిస్ఆర్డర్ (Antisocial personality disorder) జబ్బు తో బాధ పడుతున్నాడు. జైలు భయం వెంటాడుతోంది. దానికి ముందే అందరిపై కక్ష తీర్చుకోవడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నాడు' అని ఎద్దేవా చేశారు.