USA: యువతి పట్టుతప్పుతుంటే... చాకచక్యంగా క్యాచ్ చేసి కాపాడిన కోచ్... వైరల్ వీడియో ఇదిగో!

  • అమెరికాలోని నష్విల్లెలో ఘటన
  • జిమాస్టిక్స్ చేస్తూ పట్టు తప్పిన యువతి
  • ప్రమాదం నుంచి కాపాడిన కోచ్
Koach Saves Young Gimnast

ఓ కోచ్ గా ఆటలో మెళకువలను నేర్పడమే కాకుండా, తన వద్ద శిక్షణ పొందుతున్న వారు ప్రమాదంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమని, ఈ విషయంలో తాను తీసిపోనని నిరూపించాడో జిమ్నాస్ట్ కోచ్. తమ బిడ్డ ఫీట్స్ చేస్తుంటే, వీడియోలో చిత్రీకరిస్తున్న తల్లిదండ్రులు, బిడ్డ పడిపోతుంటే, ఒడుపుగా పట్టుకున్న కోచ్ వీడియోను సోషల్ మీడియాలో ఉంచారు. సుమారు 17 సెకన్ల పాటున్న ఈ వీడియోను అమెరికాలోని నష్విల్లెలో ఉన్న ఓ జిమ్నాస్ట్ శిక్షణ కేంద్రంలో తీశారు. ఆ యువతి పట్టుతప్పి పడిపోయి ఉంటే, రెండు కాళ్లూ విరిగే ప్రమాదముండేది. కానీ ఆమె పడకుండా కోచ్ పట్టుకున్నాడు. ఇప్పుడా కోచ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News