cuddpha: నాన్న బీమా సొమ్ము కొట్టేయడానికి.. అమ్మ చనిపోయిందని చెప్పిన కన్న కూతురు!

  • తల్లి బతికున్నా ముందే చనిపోయిందని సమాచారం
  • తండ్రి పేరున వచ్చే డబ్బు కోసం కుతంత్రం
  • బీమా సొమ్ము  కోసం వెళ్లిన తల్లికి విషయం తెలిసి షాక్‌
daughter cheated mother for insurence money

’నవమాసాలు నిను మోసి కనిపెంచి పెద్ద చేసిన తల్లి రుణంను దీర్చ నీ తరం వత్సా‘ అన్నాడో కవి. కానీ ఆ కుమార్తె కేవలం కొద్దిమొత్తం ప్రభుత్వం సొమ్ము కోసం బతికి ఉన్న తల్లి చనిపోయిందని చెప్పి సభ్యసమాజం తదించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే...కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలోని బలిజపల్లికి చెందిన ఆదిలక్ష్ముమ్మ, వెంకటరత్నం దంపతులు. వీరికి ఓ కుమార్తె ఉంది.

తిరుపతిలో నివాసం ఉంటున్న కుమార్తె శాంతకుమారి ఇంట్లో గత ఏడాది నవంబరు 14వ తేదీన వెంకటరత్నం చనిపోయాడు. అతని పేరు ‘చంద్రన్న బీమా పథకం’లో నమోదై ఉంది. నామినీగా భార్య ఆది లక్షుమ్మకు ఆ డబ్బు రావాల్సి ఉంది. కానీ ఆ డబ్బును కొట్టేసేందుకు శాంతకుమారి తన తండ్రి కంటే ముందే తల్లి చనిపోయిందని రాజంపేట మున్సిపల్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చింది.

దీనిపై ఎటువంటి విచారణ జరపకుండా సిబ్బంది నిజమేనని నమ్మి నామినీగా ఆమె పేరును నమోదు చేశారు. ఈ విషయం తెలియని ఆదిలక్ష్ముమ్మ అధికారుల వద్దకు వెళ్లి, తన భర్త చనిపోయాడు కాబట్టి బీమా సొమ్ము ఇవ్వాలంటూ సిబ్బందిని అడిగేసరికి అసలు విషయం బయటపడడంతో అవాక్కయ్యింది.

ఆమె ఆధార్‌ నంబర్‌ చెక్ చేసిన సిబ్బంది కూడా చనిపోయిందనుకున్న మహిళ ఎదురుగా ఉండడంతో షాక్‌ తిన్నారు. కాగా, ఈ అంశంపై ఇటీవల జిల్లా ఎస్పీని స్పందనలో కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు.

More Telugu News