KTR: ఈ వార్తను చూసి ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది: కేటీఆర్

KTR Feels Very Proud and Happy
  • ప్రతి ఒక్కరికీ మంచి నీరు అందిస్తున్నాం
  • గత ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కేసు నమోదు కాలేదు
  • ట్విట్టర్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్
ఈ ఉదయం ఓ వార్తను చదివిన తరువాత తనకెంతో గర్వంగానూ, సంతోషంగానూ అనిపించిందని తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. "గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టితో ప్రతి ఒక్కరికీ మంచి నీటిని అందిస్తున్నారు. మిషన్ భగీరథలో భాగంగా అందరు ఇంజనీర్లు, అధికారులు నల్గొండ తదితర జిల్లాల్లో ఎంతో శ్రమించారు" అంటూ "గడచిన ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు" అంటూ ఓ ఆంగ్ల దినపత్రికలో ఇచ్చిన కథనాన్ని కేటీఆర్ పోస్ట్ చేశారు.
KTR
Nalgonda District
Florosis
KCR

More Telugu News