Kalyan Dev: మూడో సినిమాకి రెడీ అవుతున్న చిరూ చిన్నల్లుడు

  • అంతగా ఆదరణ పొందని 'విజేత'
  • రెండవ సినిమాగా 'సూపర్ మచ్చి'
  • వచ్చేనెలలో పట్టాలెక్కనున్న మూడో ప్రాజెక్ట్  
Sridhar seepana Movie

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ 'విజేత' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. నటనను మెరుగు పరుచుకుంటే, రాణించే అవకాశం ఉందనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన 'పులి వాసు' దర్శకత్వంలో 'సూపర్ మచ్చి' చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. ఆ దర్శకుడి పేరే శ్రీధర్ సీపాన. రచయితగా పలు విజయవంతమైన చిత్రాలకు శ్రీధర్ సీపాన పనిచేశాడు. దర్శకుడిగా తన సత్తాను చాటాలనే ఉద్దేశంతో మెగాఫోన్ పట్టుకుని రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడిగా కల్యాణ్ దేవ్ ను తీసుకున్నాడు. విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల .. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా, మార్చి 12వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళుతోంది.

More Telugu News