Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ఒక్కసారిగా రూటు మార్చిన సమంత
  • కొరటాల సినిమాకి డేట్స్ ఇచ్చిన మహేశ్ 
  • వరుణ్ తేజ్ కి అమ్మగా నిన్నటి కథానాయిక
Samantha starts shoot for harror movie from March

 *  అందాలతార సమంత ఇప్పుడు రూట్ మార్చింది. కొత్తగా హారర్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ మార్చి నుంచి జరుగుతుంది. ఇది కేవలం హారర్ చిత్రమే కాదనీ, అంతకు మించిన విషయమున్న చిత్రమని సమంత పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది రూపొందుతుంది.
*  చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో మహేశ్ బాబు ప్రత్యేక పాత్రను పోషించనున్నాడంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మహేశ్ 20 రోజులు కేటాయించాడనీ, మే నెలలో ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతాడని తాజా సమాచారం.
*  మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బాక్సర్ గా పక్కా మాస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో వరుణ్ కి తల్లిగా ప్రముఖ నటి నదియా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ విశాఖలో జరుగుతోంది.  

More Telugu News