Atchannaidu: ఎయిర్ పోర్టులోనే మమ్మల్ని ఆపి ఉంటే బయటికి వచ్చేవాళ్లం కాదు: అచ్చెన్నాయుడు

Atchannaidu gets anger at Vizag airport
  • చంద్రబాబును వైజాగ్ లో అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
  • ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారన్న అచ్చన్న
  • న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం చేశారని ఆరోపించారు. "నిన్ననే అనుమతి ఇవ్వకపోతే మేం ఇక్కడి దాకా వచ్చేవాళ్లం కాదు కదా... ఎయిర్ పోర్టు లోపలే మమ్మల్ని ఆపి ఉంటే రోడ్డుపై ఇంత ఉద్రిక్తత జరిగేది కాదు కదా... ఇదంతా ఓ పద్ధతి ప్రకారం చేసిన కుట్ర" అంటూ మండిపడ్డారు.

"మేం ఎంతవరకైనా ఇక్కడే ఉంటాం. పోలీసులు మాకు అనుమతి ఇచ్చారు. ఇక్కడి నుంచి మేం విజయనగరం కూడా వెళ్లాల్సి ఉంది. చంద్రబాబు అంటే ప్రభుత్వానికి ఎందుకు భయం? ప్రజలకు ఎవరి వాదన వారు వినిపించుకుందాం. ఎవరి వాదన నచ్చితే వారివైపే ప్రజలు ఉంటారు. అలాంటప్పుడు చంద్రబాబును ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు. "పోలీసుల వైఖరిలో మార్పు రావాల్సి ఉంది. దీనిపై మేం న్యాయపోరాటం చేస్తాం? అంటూ స్పష్టం చేశారు.
Atchannaidu
Chandrababu
Vizag
YSRCP
Police
Airport

More Telugu News