Rajkumar Hirani: షారుఖ్ సరసన కాజోలా? కరీనానా?

Kajol or Kareena Kapoor Khan who will play lead opposite Shah Rukh Khan
  • రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుక్ సినిమా 
  • ఏప్రిల్ తర్వాత సెట్స్ పైకి
  • వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సినిమా తీయబోతున్నాడని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై హీరో, డైరెక్టర్ తొందర్లోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను ప్రత్యేకంగా కెనడా, లండన్, గుజరాత్‌లో షూట్ చేయబోతున్నారట.

ఇక, షారుఖ్ సరసన హీరోయిన్‌గా కాజోల్, కరీనా కపూర్‌‌లో ఎవరిని ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. కాజోల్, కరీనా ఇద్దరూ మంచి యాక్టర్లే. పైగా తానాజీతో కాజోల్, గుడ్‌న్యూజ్ తో కరీనా ఈ మధ్య బ్లాక్‌బాస్టర్‌‌ హిట్స్‌ సాధించారు. మరి, వీరిలో రాజ్‌కుమార్‌‌ ఎవరిని ఫైనల్‌ చేస్తాడనే దానిపై షారుఖ్  అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది.

ఏప్రిల్‌ తర్వాత సెట్స్ మీదకు 

రాజ్‌కుమార్‌‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ  సినిమాకు షారూఖ్ ఇప్పటికే డేట్స్ ఇచ్చాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఏప్రిల్‌ లేదా మే నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లి.. 2021లో రిలీజ్‌ చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారట. కాగా, ఈ మూవీకి ముందు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే తీయబోయే ఓ సినిమా, తమిళ దర్శకుడు అట్లీతో మరో మూవీ గురించి కూడా షారుఖ్ ప్రకటించే చాన్సుందని సమాచారం.

  • Loading...

More Telugu News