Corona Virus: జపాన్ విహార నౌక డైమండ్ ప్రిన్సెస్ నుంచి భారతీయుల తరలింపు

Stranded Indians in Diamond Princess returns home
  • కరోనా భయంతో ఓడరేవులో నిలిచిపోయిన జపాన్ విహార నౌక 
  • వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో ప్రయాణికుల నిర్బంధం
  • భారతీయులకు విముక్తి కల్పించిన అధికార వర్గాలు
కరోనా వైరస్ బీభత్సం నేపథ్యంలో జపాన్ విహార నౌక డైమండ్ ప్రిన్సెస్ లో చిక్కుకున్న వందలాది భారతీయులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వ్యాపిస్తుందన్న కారణంతో నౌకలోనే ఉండిపోయిన 119 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. డైమండ్ ప్రిన్సెస్ నుంచి వెలుపలికి వచ్చిన భారత జాతీయులను మొదట టోక్యో విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి వారిని ఎయిరిండియా విమానంలో ఢిల్లీ చేర్చారు. ఈ సందర్భంగా భారత అధికార వర్గాలు జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలో మొత్తం 3,711 మంది ఉండగా, వారిలో 132 మంది భారతీయులు సిబ్బందిగా ఉన్నారు. వీరితో పాటు మరో ఆరుగురు భారత ప్రయాణికులు కూడా ఉన్నారు.
Corona Virus
Japan
Diamond Princess
Indians
AirIndia

More Telugu News