China: వూహాన్‌లో చిక్కుకున్న కర్నూలు జ్యోతి ఢిల్లీకి చేరిక

  • చైనా నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో చేరిక 
  • పదిహేను రోజులపాటు ఆమెకు వైద్య పరీక్షలు
  • ఆ తర్వాత కర్నూలుకు పంపే అవకాశం
kurnool tcl employee returned to India

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కర్నూలుకు చెందిన జ్యోతి కుటుంబానికి తీపికబురు అందింది. టీసీఎల్‌ కంపెనీ శిక్షణ కోసం చైనాలోని వూహాన్‌ నగరానికి వెళ్లిన జ్యోతి కరోనా కల్లోలం నేపథ్యంలో అక్కడ చిక్కుకుంది. భారత్‌ పంపిన రెండు ప్రత్యేక విమానాలు వచ్చిన సమయానికి ఆమెకు జ్వరం ఉండడంతో అక్కడి అధికారులు ఆమెను స్వదేశానికి పంపేందుకు అంగీకరించ లేదు.

దీంతో ఆమెతోపాటు వెళ్లిన వారు వచ్చినా ఆమె రాకపోవడం, ఆమెకు పెళ్లి కూడా నిశ్చయం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. దీంతో జ్యోతిని స్వదేశానికి రప్పించేందుకు సాయపడాలంటూ కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు, ఎంబసీ అధికారులకు పలుమార్లు చేసిన విజ్ఞప్తుల మేరకు ఎట్టకేలకు వారి ఎదురు చూపు ఫలించింది. ఈ రోజు ఉదయం చైనా నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న జ్యోతిని అక్కడే పదిహేను రోజులపాటు ఉంచనున్నారు. అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) సోకలేదని నిర్ధారణ అయితే కర్నూలు పంపేందుకు అంగీకరిస్తారు.

More Telugu News