Rajinikanth: ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్టు?: కేంద్రాన్ని ప్రశ్నించిన రజనీకాంత్

  • సీఏఏ వ్యతిరేక అల్లర్లలో హింసపై రజనీ స్పందన
  • 27 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆగ్రహం
  • ఇది కచ్చితంగా కేంద్ర హోంశాఖ వైఫల్యమేనని వ్యాఖ్యలు
Rajinikanth questions NDA

దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల అల్లర్లలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఇంతమంది చనిపోయారని విమర్శించారు. కచ్చితంగా దీనికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది, దీన్ని నేను ఖండిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, నిరసనల  విషయంలో కేంద్ర నిఘా వర్గాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోయాయని అన్నారు. నిఘా వర్గాలు విఫలం అయ్యాయంటే అది కచ్చితంగా కేంద్ర హోంశాఖ విఫలం చెందినట్టుగానే భావించాలని పేర్కొన్నారు.

గతంలో సీఏఏపై రజనీ వ్యాఖ్యానిస్తూ, ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. ఒకవేళ ముస్లింలకు దీని వల్ల ఏదైనా నష్టం జరుగుతుందని భావిస్తే గొంతు విప్పే వాళ్లలో తానే మొదటివాడ్నవుతానని తెలిపారు. అన్నట్టుగానే తన మాట నిలబెట్టుకున్నారు. సీఏఏ కారణంగా ప్రభావితులవుతున్న ప్రతి ఒక్కరికి మద్దతుగా నిలుస్తాను అంటూ తాజా వ్యాఖ్యలు చేశారు.

More Telugu News