ప్లీజ్...సంయమనం పాటిద్దాం: ఢిల్లీ ఆందోళనకారులకు క్రికెటర్ సెహ్వాగ్ విజ్ఞప్తి
- శాంతియుత సహజీవనానికి పెట్టింది పేరు రాజధాని
- ఆ పేరుకు మచ్చవచ్చే పని మనం చేయవద్దు
- హింసాత్మక ఘటనలకు స్వస్తి పలకాలని వేడుకుంటున్నా
ఈ ఘర్షణల్లో రెండు వర్గాలకు చెందిన 18 మంది ఇప్పటికే మృతి చెందారు. దాదాపు 180 మంది గాయపడగా అందులో 48 మంది పోలీసులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సెహ్వాగ్ స్పందించారు.
‘ప్రశాంత వాతావరణానికి నిలయమైన ఢిల్లీలో ఈ ఘటనలు బాధ కలిగిస్తున్నాయి. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న గొప్పదేశానికి రాజధాని మన ఢిల్లీ. అటువంటి చోట ఏ ఒక్కరికి చిన్న గాయమైనా అది దేశానికే మచ్చ తెస్తుంది. అందువల్ల అంతా శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు.