Junior NTR: త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ సరసన సమంత?

Trivikram Srinivas Movie
  • ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా 
  •  ఇద్దరు కథానాయికలకు అవకాశం
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడు హిట్లు కొట్టిన సమంత

త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడనే విషయం ఖరారైపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథపైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వుంటుందనే టాక్ వచ్చిన దగ్గర నుంచి కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు ఛాన్స్ ఉండనుంది.

ఈ నేపథ్యంలో పూజా హెగ్డే పేరు .. రష్మిక మందన పేర్లు వినిపించాయి. తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సరసన ఒక  నాయికగా సమంతను తీసుకోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. ఆ పాత్రకి సమంత అయితేనే సరిగ్గా సరిపోతుందని ఆయన భావిస్తున్నాడని చెబుతున్నారు. ఇటు త్రివిక్రమ్ దర్శకత్వంలోను .. అటు ఎన్టీఆర్ కాంబినేషన్లోను నటించిన అనుభవం సమంతకి వుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో ఆమె చేసిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక మరో కథానాయికగా రష్మిక పేరు మాత్రం వినిపిస్తూనే వుంది.

  • Loading...

More Telugu News