Chennai: అమ్మాయిలా వలపు వల విసిరి.. 350 మందిని ముంచిన మిమిక్రీ కళాకారుడు

Mimicry artist Cheating boys as posing girl
  • తమిళనాడులోని చెన్నైలో ఘటన
  • ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితులు
  • నిందితుడిని మిమిక్రీ ఆర్టిస్ట్ రాజ్‌కుమార్‌గా గుర్తింపు
ఓ మిమిక్రీ ఆర్టిస్ట్ అమ్మాయిలా గొంతుమార్చి ఏకంగా 350 మందిని మోసం చేసిన ఘటన చెన్నైలో జరిగింది. ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తిరునెల్వేలి జిల్లా పణుకుడికి చెందిన వళ్లల్ రాజ్‌కుమార్ మిమిక్రీ ఆర్టిస్ట్. అమ్మాయిలా గొంతుమార్చి అబ్బాయిలకు ఫోన్ చేసి వలపు వల విసిరేవాడు. వారు తమ ట్రాప్‌లో పడ్డారని భావించిన తర్వాత వారి నుంచి డబ్బులు గుంజేవాడు. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 350 మందిని మోసం చేశాడు. ఆ తర్వాత పత్తాలేకుండా పోయేవాడు.

మోసపోయామని ఆ తర్వాత తీరిగ్గా బాధిపడిన యువకులు.. పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమకు మైలాపూర్, కీల్ పాక్కం ప్రాంతాల నుంచి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు అందినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే అమ్మాయిలా గొంతు మార్చుతున్న రాజ్‌కుమార్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
Chennai
Tamil Nadu
mimicry artist
Crime News

More Telugu News