Nithin: నితిన్ కొత్త సినిమా లాంచ్

  • 'భీష్మ'తో హిట్ కొట్టిన నితిన్ 
  • సెట్స్ పైకి  'అంధదూన్' రీమేక్ 
  • సొంత బ్యానర్లో నిర్మాణం
Merlapaka Gandhi Movie

ఈ ఏడాదిలో హిట్ కొట్టాలనే నితిన్ కోరిక, 'భీష్మ' సినిమాతో నెరవేరింది. కలర్ ఫుల్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమాకి, యూత్ నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజున నితిన్ మరో సినిమాను లాంచ్ చేశాడు. కొంతకాలం క్రితం హిందీలో హిట్ కొట్టిన 'అంధదూన్' సినిమాకి ఇది రీమేక్.

ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను నితిన్ సొంతం చేసుకున్నాడు. సొంత బ్యానర్లోనే ఆయన ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వగా .. 'దిల్' రాజు కెమెరా స్విచ్ఛాన్ చేయగా .. సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు.

ప్రస్తుతం నితిన్ .. 'రంగ్ దే'.. 'చెక్' సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతనే, ఆయన 'అంధదూన్' రీమేక్ షూటింగులో పాల్గొననున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News