pridviraj: నన్ను బయటకు పంపి కొందరు పైశాచికానందం పొందారు: తిరుమలలో పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

  • కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను
  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అమలు చేస్తానన్నాను
  • ఆ హామీ ఇచ్చినందుకే నాపై కుట్ర పన్నారు
  • రైతులను కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు
pridvi raj on his suspension

ఓ ఉద్యోగినితో 'సరస' సంభాషణ ఆడియో బయటకు రావడంతో సినీనటుడు పృథ్వీరాజ్‌ను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రపూరితంగా తనను ఎస్వీబీసీ నుంచి తప్పించారని, తనను బయటకు పంపి కొందరు పైశాచికానందం పొందారని చెప్పారు. దీంతో తాను కొన్ని రోజులుగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను అమలు చేస్తామని  హామీ ఇచ్చినందుకే తనపై కుట్ర పన్నారని పృథ్వీరాజ్‌ ఆరోపించారు. సజ్జల, వైవీ, విజయసాయిరెడ్డిలకు మాత్రమే తాను జవాబుదారిగా ఉంటానని చెప్పారు. నిరసనలు తెలుపుతున్న అమరావతి రైతులపై తాను చేసిన 'పెయిడ్‌ ఆర్టిస్టులు' వ్యాఖ్యలపై స్పందించారు. రాజధాని రైతులను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని చెప్పారు.

More Telugu News