Balkakrishna: బాలయ్య సినిమాకి కీర్తి సురేశ్ కూడా నో చెప్పిందట

Boyapati Movie
  • బాలకృష్ణతో బోయపాటి సినిమా
  • హీరోయిన్స్ ఎంపిక విషయంలో జాప్యం 
  • మరోసారి బాలయ్యతో జోడీ కడుతున్న అంజలి  
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఒక కథానాయికగా నయనతారను అనుకున్నారు. అయితే తనకి గల కమిట్మెంట్స్ కారణంగా కుదరదని నయనతార చెప్పిందట .. దాంతో శ్రియను తీసుకున్నారు.

ఇక మరో కథానాయిక పాత్ర కోసం కీర్తి సురేశ్ ను సంప్రదించారట. ఆమె కూడా తన డేట్స్ లేవంటూ సున్నితంగానే తిరస్కరించినట్టు సమాచారం. ఆ సమయంలోనే కేథరిన్ ను సంప్రదించగా, భారీ పారితోషికాన్ని అడిగిందట. అప్పుడే అంజలి పేరును పరిశీలించి ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో 'డిక్టేటర్' చిత్రంలో బాలకృష్ణకి జోడీగా అంజలి కనిపించింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో అంజలికి కూడా ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. బోయపాటి సినిమాతో ఆమె కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూడాలి.
Balkakrishna
Shriya
Anajali
Boyapati Sreenu Movie

More Telugu News